ఆలయ చరిత్ర
ఆలయ చరిత్ర
ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

నర్సింహాపురం గ్రామం లో సకల సంపదలతో నివాసం ఉన్న ఆర్య వైశ్యకుల శ్రేష్ఠుడు మహా దానగుణ సంపన్నుడు, నిత్యం శివలింగ ధారణ తో బాసిల్లేడు వాడు అయిన శ్రీ కొండ పాపయ్య గారికి ఒక రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వప్నం లో సాక్షాత్కరించి, నీకు తూర్పు దిశలో గల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. నన్ను తీసుకువచ్చి ఊరియందు నీకు గల స్థలములో తూర్పుగా నన్ను ప్రతిష్టింపజేసినచో నీకు, మీ కుటుంబానికి, మీ వంశానికి, మీ గ్రామ ప్రజలకి సకల శుభాలు కలుగుతాయని తెలిపి అంతర్ధానమైనాడు.
మరుసటి రోజు దైవజ్ఞులైన పండితులను, బ్రాహ్మణోత్తములను, పిలిపించి స్వప్న వృత్తాంతమును తెలిపి వారి యొక్క సూచనల మేరకు ఇప్పుడు ఉన్న స్థలంలో స్వామి వారిని ప్రతిష్టించుటకు నిర్ణయించి స్వామి సాక్షాత్కారమునకు వేచి చూసినారు.
1866వ సంవత్సరం లో తూర్పు వైపు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో నాగలికి స్వామి వారు తగలగా సేవకుల ద్వార విషయం తెలుసుకొని
భూమి నుండి పైకి తీసి వేద మంత్రములతో అభిషేకించి భక్తి ప్రపత్తులతో మేళతాళాలతో స్వామిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఈ స్థలంలోనే ప్రతిష్ఠించడం జరిగింది.


శివలింగ ప్రతిష్ట

కొంతకాలం తర్వాత ఎల్లప్పుడు శివ ధ్యాన నిష్టాగరిష్టుడు, సకల శాస్త్ర ప్రవీణుడు, సకల సంపదలతో తులతూగుతూ, ప్రజల కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా పేరొందిన వారి యొక్క పెద్ద కుమారుడు శ్రీ కొండా వెంకటాద్రి గారు కాశీ యాత్రకు వెళ్ళడం జరిగింది. కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శించి, సేవించి కొద్ధికాలం అక్కడనే ఉండి ప్రముఖ ఈశ్వర దేవాలయాలను సందర్శించి అనేక అభిషేక కార్యక్రమములను నిర్వహించాడు. జట్కా బండిలో తిరుగుప్రయాణం సాగించుచుండగా కొంత దూరం ప్రయాణించిన తరవాత జట్కా బండి గుర్రములు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా నిలబడి ఉండెను.
అక్కడ దగ్గరలో ఒక ముని ఆశ్రమము కనిపించెను. అక్కడికి వెళ్లగా ఆశ్రమం వద్ద ఉన్న ఒక వట వృక్షం క్రింద ఒక ముని తపస్సులో లీనమై ఉన్నాడు.
ఆ మునీశ్వరుడు దివ్య దృష్టితో చూసి నీవు ధన్యుడవు, నీకు ఈశ్వర అనుగ్రహం కల్గింధని చెప్పి ఆశ్రమంలోకి వెళ్లి ఒక శివలింగాన్ని మరియు నంది విగ్రహాన్ని తెచ్చి ఇచ్చెను.
ఈ లింగమును మీ గ్రామములోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము లోనే ప్రతిష్టించి, నిత్యం పూజించమని తెలియజేసినారు. అందువలన మీకు మీ వంశానికి, సమస్త గ్రామ ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యములు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆశీర్వదించి పంపినాడు. అది ఈశ్వర అనుగ్రహంగా భావించి స్వగ్రామమునకు తిరిగి వచ్చిన తరవాత 1905 సంవత్సరంలో ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వారి జీవిత కాలమంతా ఆ శివలింగాన్ని అర్చింఛి, పూజించి తదనంతరము శివైక్యం చెందినాడు.

ఆలయ చరిత్ర (1865 నుండి)
ఆలయ చరిత్ర (1865 నుండి)


ఆలయ చరిత్ర (1865 నుండి)

